రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాజేష్ నాయక్,కడెం మండల అధ్యక్షులు బేర చిన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల ఉపాధ్యాయులతో కలిసి కడెం ఎమ్మార్వో ప్రభాకర్కు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని మరిచారన్నారు. ఉపాధ్యాయుల బదిలీ, ప్రమోషన్లతో పాటు రిటైర్మెంట్ ఉపాధ్యాయుల ఆర్థిక లావాదేవీలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.