కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద జిల్లా కాంగ్రెస్ మరియు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యానందరావు గాంధీరాజు,ఐఎన్టియూసి నాయకులు తాళ్లూరు రాజులు లు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని మండిపడ్డారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులను నడ్డి విరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తుందని ఆరోపించారు,