మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ.. సశక్త పరివార్ ప్రారంభించిందని పమిడిపాడు వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. గురువారం నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో మహిళా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. స్త్రీలలో వచ్చే సమస్యలు, తీసుకునే ఆహారంపై ఈ శిబిరంలో అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.