విజయనగరం డైట్ అధ్యాపక బృందం వాకా చిన్నం నాయుడు, ఏ శశిభూషణరావు,ఎస్ ఇ శాస్త్రి, కే అన్నారావు, డి శ్రీనివాసరావు లు గంట్యాడ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో పలు అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మేము సక్రమంగా అమలు జరుగుతోందా లేదా అన్న విషయాన్ని కూడా ఆరా తీశారు.