పెదవేగి మండలం బి సింగవరం గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రకాశం 40 ఆదివారం గేదెలు మేపేందుకు విజయరాయి సమీపంలో ఉన్న తమ్మిలేరు కాల్వ గట్టుకు వెళ్ళాడు. గేదెలు మేపుతున్న సమయంలోప్రమాదవశాత్తు అతను కాలుజారి తమ్మిలేరులో పడ్డాడు.సమాచారం అందుకున్న పెదవేగి పోలీసులు మృతదేహం కోసం ఎన్ డి ఆర్ ఎస్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులుకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు