గురువారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదరపల్లి సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది.పేద ప్రజల సొంతింటి కల ఈనెల 6 తేదీ నాడు లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. లబ్ధిదారులకు గృహప్రవేశం చేసే అన్ని మౌలిక సదుపాయాలతో అన్ని ఏర్పాటు జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సభా ప్రాంగణం పనులను కూడా పరిశీలించడం జరిగింది.