జిల్లా ఎస్పీ కార్యాలయంలో చీఫ్ పీఆర్‌ఓ పదవిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ గారి చీఫ్ పీఆర్‌ఓగా వ్యవహరించిన టి. అబ్దుల్ గౌస్ ఆదోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కమాండ్ కంట్రోల్ సీఐ శివశంకర్‌ను కొత్త చీఫ్ పీఆర్‌ఓగా నియమిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.గౌస్ గత కొంతకాలంగా ఎస్పీ కార్యాలయానికి, మీడియా ప్రతినిధులకు మధ్య వారధిగా వ్యవహరించి సమాచారం అందిస్తూ, కమ్యూనికేషన్‌ను సజావుగా కొనసాగించారు. ఆయన బదిలీ కారణంగా ఈ బాధ్యతలను ఇప్పుడు సీఐ శివశంకర్ చేపట్టనున్నారు.మీడియా మిత్రులు అత్యవసర సమాచారం, సందే