ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో సాయంత్రం ఐదు గంటలకు సరెండర్ కానున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకుని రాజమండ్రి కి బయలుదేరారు.