సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం బడిబాట నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని హెచ్ఎం శోభారాణి తెలిపారు. ఇక్కడే నాణ్యమైన, ఉచిత విద్య అందుతుందని పేర్కొన్నారు.