ద్వారకాతిరుమల క్షేత్రదేవత శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారు గురువారం తెల్లవారుజాము నుంచి కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాత్యాయని దేవి అలంకారం పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు.