శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అధిష్టానం పిలుపుమేరకు అన్నదాత పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్తు రామారావును పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎరువులు లేక పంటను పండించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు సమస్యను ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న కార్యక్రమంలో తనను అరెస్టు చేయడం సరికాదని ఆయన తెలిపారు..