కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఆయుర్వేద వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద వైద్యంతో నయం చేయవచ్చని తెలిపారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, ఆయుర్వేద వైద్యులు ఉమాదేవి, నీలిమ, దేవయ్య పాల్గొన్నారు.