చిన్న శంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం ఐదు గంటలకే బారులు తీరారు, ఒక ఆధార్ కార్డు కు ఓకే యూరియా సంచి అని సూచించడంతో కుటుంబ సభ్యులంతా కూడా యూరియా కోసం క్యూలో నిలబడ్డారు, మహిళల సైతం యూరియా కోసం వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుంది, ఇంటి వద్ద ఉన్న పనులన్నీ వదులుకొని చిన్న పిల్లలతో యూరియా కోసం దుకాణాల వద్దకు రావడం జరుగుతుందని పనులు బదులుకొని ఉదయం నుండే యూరియా కోసం పడి కాపులు కాస్తున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.