ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారుల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా నిర్దేశిత గడువులోపు వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 13 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు.