గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాయచోటిని జిల్లా కేంద్రంగానే ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది.ఈ మేరకు టీ.ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్బవర హరిబాబు, భారతీయ అంబేద్కర్ సేన నాయకుడు పల్లం తాతయ్య, రజక సంఘం నాయకులు టి.రమేష్, వీరబల్లి శ్రీనివాసులు, మండల లీగల్ సర్వీస్ కమిటీ మాజీ సభ్యుడు విశ్వనాథరెడ్డి, ఏపీటీఎఫ్ తదితరులు పాల్గొన్నారు.