తురకపాలెంలో కలుషిత నీటిని తాగి 30 మంది చనిపోయినా, ప్రభుత్వం కనీసం స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.శనివారం మీడియా సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడుతూ తమ నాయకులు గ్రామానికి వెళ్లే వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జంతు కళేబరాలు ఉన్న క్వారీ గుంత నుంచి ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీరు తరలించారని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.