ప్రకాశం జిల్లా తాళ్లూరు ముండ్లమూరు దర్శి మండలాలను మార్కాపురం జిల్లాలో కలపవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రజాభిప్రాయాలను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరబ్రహ్మం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు పోరాడుతామని తెలిపారు.