ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లను ఇటీవల బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నూతన డాక్టర్గా నాయక్ బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు వైద్య పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హాస్పిటల్ కి వచ్చే స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.