సోన్ మండలం గంజాల్ గ్రామంలో వరి పంట పొలాలను ఏఈఓ వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. రైతులు మొదటి విడత గ్రాన్యూల్ యూరియా వాడిన తర్వాత రెండవ దఫా నానో యూరియా పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. వరి పంటలో బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించినట్లయితే నివారణకు నత్రజని వాడకుండా పోటాష్ వాడాలని సూచించారు. ఇందులో రైతులు పోశెట్టి ముత్యం తదితరులున్నారు.