వాంకిడి మండలంలోని సరండి గ్రామంలో ఆదివారం భవానీ జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రతిఏటా పొలాల అమావాస్యను పురష్కరించుకుని సరండి గ్రామ శివారులోని గుట్ట పై వెలసిన భవానీ మాతను ఇక్కడి రైతులు దర్శించుకొని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి మండలంలోని రైతులతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.