మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం నుండి బంటు బానిసరి అనే ఐదవ తరగతి చదువుతున్న బాలిక ఈరోజు ఉదయం అదృశ్యమైంది పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు హుటాహుటిన స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు సాయంతో బాలిక జాడను గంటల వ్యవధిలో ట్రేస్ చేసి పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో బాలిక ఆచూకీని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.