పాపన్నపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గారి పై అనుచితమైన అసభ్యకరమైన పదజాల ని ఉపయోగించి విమర్శించడం జరిగింది. ఆ దుశ్చర్యకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర బిజెపి శాఖ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా పాపన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు అందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.