నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన వలిపి భాస్కర్ బుధవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇనుప నిచ్చెనను బంధువుల ఇంటి నుంచి తీసుకెళ్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు వెంటనే స్పందించగా అప్పటికే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.