కృష్ణ మండలంలోని కున్సి గ్రామంలో వేణుగోపాల స్వామి జాతర మహోత్సవ సందర్భంగా ఎద్దుల బండ్ల గిరక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను దేవాలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శరణ్ గౌడ్, నల్లేరు నర్సప్ప ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శరణప్ప గౌడ, విశ్వనాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.