రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసర సరుకులు, బట్టలు తడిసిపోయి నిరాశ్రుయులు అయిన కుటుంబాలను స్థానిక వ్యాపారవేత్త వెంకుగారి రాజిరెడ్డి సహకారం అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వెంకుగారి రాజిరెడ్డి సహకారంతో స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. 20 నిరుపేద కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నగదు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, TUWJ IJU రాష్ట్ర నాయకులు డీజే శ్రీనివాస శర్మ చేతుల మీదుగా పంపిణి చేశారు.