ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నాయుడు పల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారిని బుజ్జి భాయి ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. పొలంబడి కార్యక్రమం 14 వారాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విత్తనం విత్తడంతో మొదలై పంట కోత వరకు వారానికి ఒకరోజు చొప్పున 14 వారాలు రైతులకు పంటల ఎంపిక మట్టి నమూనాల సేకరణ విత్తనాల మొలకెత్తింపు పరీక్ష తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.