ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో శుక్రవారం అనుమానంతో భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు శనివారం హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సాక్షాలను సేకరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జున వివరాలు వెల్లడించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్ తో కలిసి ఎస్సై రవీంద్రారెడ్డి పరిశీలించి సాక్ష్యాలు సేకరించారు.