తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో శుక్రవారం ఒకమహిళా కూలీకి వ్యవసాయ తోటలో వజ్రం లభ్యమైంది.మిరపకాయలు తెచ్చుకుంటున్న సమయంలో ఆమె కొంతభాగం మట్టితో కప్పబడిన వజ్రాన్ని చూసింది. ఈ విషయంతెలుసుకున్న స్థానిక వ్యాపారి వజ్రాన్ని రూ. లక్షకు కొనుగోలుచేసినట్లు తెలిపారు. మహిళా కూలీకి వజ్రం రూపంలో అదృష్టంవరించింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోవజ్రాల కోసం ప్రజలు అన్వేషిస్తారు.