జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు గేట్ల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ, సమీప గ్రామాల ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఈ పరిశీలనలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.