చోడవరం-యనమలకుదురు కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనమలూరుకు చెందిన ఆవాల వెంకటేశ్ (36) మరణం పాలయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశ్ను ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.