శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో, వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడానికి పుట్టపర్తి డివిజన్ పరిధిలోని సిఐల సమన్వయంతో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సాయి ఆరామంలో జరిగిన ఈ సమావేశంలో పుట్టపర్తి టౌన్, పుట్టపర్తి రూరల్, బుక్కపట్నం మండలాల పీస్ కమిటీ సభ్యులు, మత పెద్దలు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగను ఘనంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు.