కడప జిల్లాలోని బద్వేల్ ను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండదని శ్రీ వీరబ్రహ్మేంద్ర జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు.శుక్రవారం బద్వేల్ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర జిల్లా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలోనే పునరుద్ధరించాలని లేనిపక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జిల్లాగా కొనసాగించాలని తెలిపారు. బద్వేల్ ను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే బద్వేల్ నియోజకవర్గ ఉనికిని కోల్పోతామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.