ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్ మండలం మలంగి గ్రామానికి చెందిన జాడే శంకర్ అనే రైతు వాగులో గల్లంతై మృతిచెందాడు. బుధవారం సాయంత్రం 7గంటలకు పొలం పనులు చేసుకొని తిరిగి వస్తుండగా మలంగి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శంకర్ ముగ్గురిని వాగు దాటించారు. తర్వాత తాను దాటే ప్రయత్నంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించాడు. శంకర్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం నార్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.