కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గాయత్రీ కాలేజీ ఆవరణంలో ఆదివారం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సులను కేటాయించి, దివ్యాంగుల నుంచి అర్థ టికెట్ ను వసులు చేస్తుందని ఇది మంచి పద్ధతి కాదన్నారు. దివ్యాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు తెలిపారు.