ఆగస్టు 28 న 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని బ్రాడిపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వామపక్ష పార్టీ శ్రేణులతో కలిసి వై. నేతాజీ మాట్లాడారు టిడిపి ప్రభుత్వం 2010 లో విద్యుత్తు సంస్కరణల పేరుతో ప్రజలపై భారీ ఎత్తున భారాలు మోపిందన్నారు. దానికి నిరసనగా ఛలో హైదరాబాద్ పిలుపునిచ్చి వామపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పోలీసులతో కాల్పులు చేపించి ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్నారని తెలిపారు.