రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగనుందని తెలిపారు.. బూత్ లెవెల్ ఆఫీసర్ ల నియామకాన్ని పూర్తి చేసి, ట్రైనింగ్ కూడా పూర్తి చేశామని, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.