నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించిన కర్ర వినాయకుడిని గురువారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. పార్వతి తనయుడికి ప్రత్యేక పూజలు జరిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన పాలజ్ కర్ర గణపతి తరహాలో జిల్లా కేంద్రంలో సైతం కర్ర వినాయకుడిని ప్రతిష్టించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు.