ఖమ్మం జిల్లాలో అభివృద్ది పనులకు స్ధలసేకరణ వేగవంతం చేయండి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాజీపేట విజయవాడ మూడవ లైన్ కు జిల్లాలో స్దల సేకరణ పూర్తి చేయాలి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వివిధ అభివృద్ది కార్య్రకమాల పురోగతి పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కాజీపేట – విజయవాడ రైల్వే మూడవ లైన్ ప్రాజెక్ట్ చాలా ప్రాధాన్యత కలిగినదని, ఈ లైన్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, భవిష్యత్ రైల్వే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిపాలన యంత్రాంగం అన్ని విధాల సహకరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.