కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయతీ తమన్న మెరక గ్రామంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న గిరిజన భార్యాభర్తలు ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య వెంకటలక్ష్మి మృతి చెంది కిందపడి ఉండడం, భర్త చిరంజీవిలు నేలను తాకి ఫ్యాన్ కు ఉరి వేయబడి ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు వీరిద్దరి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల క్రితమే వివాహమైన వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారని, శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివచ్చిన భార్యాభర్తలు శనివారం ఉదయం ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింద