గుమ్మఘట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టును రాయదుర్గం నియోజకవర్గ టిడిపి పరిశీలకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లు సందర్శించారు. ఆదివారం ఉదయం వారు బిటిపి జలాలకు పూజలు నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భైరవానితిప్ప ప్రాజెక్టుకు హంద్రీనీవా కృష్ణాజలాలు తీసుకువచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఆ కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఒప్పించి కాలువ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.