మెదక్ అసెంబ్లీ ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా పనిచేస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం నుండి రాత్రి వరకు నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశించారు.