ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ గర్భంలో శిశువు మృతి చెందడంతో సంబంధిత కుటుంబీకులు ఆందోళన చెందారు. పట్టణ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన తీరులో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భంలో శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. గర్భంలో శిశు మృతి చెందడంతో పట్టణంలో చర్చ జరుగుతుంది. పలువురు గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు.