మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం లోని టేక్మాల్ మండలంలో సోమవారం నాడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం మోడల్ స్కూల్ మరియు తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మౌలిక వసతులపై కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రిన్సిపల్ సాయిలు తో కలిసి సంప్రదింపులు జరిపారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను వెంటనే ప్రారంభించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి డిఎస్పి ప్రసన్నకుమార్ వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.