సూర్యాపేట జిల్లా: రైతాంగానికి సరిపడా యూరియాను అందించాలని బిఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య గురువారం డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి లోని రైతు సేవ సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపి సొసైటీ కార్యదర్శి వినతి పత్రాలు అందజేశారు. రైతులు వరి నాట్లు వేసుకొని యూరియా కోసం పడిగా అప్పుడు పడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించిందన్నారు. యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయాన్నారు.