రాజవొమ్మంగి పంచాయతీలోని సూరంపాలెం గ్రామంలో నిత్యం ప్రజలు తిరిగే రహదారి ఆధ్వానంగా తయారయ్యింది. చినుకు పడితే చిత్తడిగా మారి అడుగు తీసి అడుగు వేయనీయకుండా ఉన్నామంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా ఈ ఇబ్బంది తప్పడం లేదంటున్నారు. మరోవైపు గ్రామంలో డ్రైనేజీ సదుపాయం లేక మరుగుదొడ్ల నుంచి వచ్చే మురుగు కూడా రోడ్ పై ప్రవహిస్తుండటంతో దోమలు, ఈగలు పెరిగిపోయాయని అంటున్నారు.