పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట కౌవులు రైతులు రైతు సంఘం నాయకులు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధర్నా నిర్వహించారు. భూ యజమాని అనుమతి లేకుండానే వాస్తవంగా సాగు చేస్తున్న రైతులను గుర్తించి గ్రామ విఆర్వో వ్యవసాయ అధికారులు పట్టా సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పంట రుణాల పంపిణీ సమర్థవంతంగా పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.