కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు మంగళవారం మధ్యాహ్నం ఆరోపించారు. ప్రభుత్వాల కుట్రలను ఖండిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రాజెక్టుపై ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆయన అన్నారు.