సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం సూచించారు. మంగళవారం బిక్కనూర్ మండలం జంగంపల్లిలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా ప్రభుత్వ కార్యాలయాల నుంచి పొందవచ్చన్నారు.