కణేకల్లు మండలం జక్కలవడికి గ్రామానికి చెందిన తల్లి, కూతురు అదృశ్యమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి బార్య కళ్యం భారతి ఆరేళ్ల కూతురు జాన్సిక తో కలిసి సోమవారం మద్యాహ్నం పొలానికి వెళుతూ అటునుంచి అటే ఎక్కడిడో వెళ్లింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఉదయం కణేకల్లు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి సమాచారం తెలిస్తే పోలీసులకు గానీ 8886711738 కు ఫోన్ చేసి తెలపాలని కోరారు.