కలికిరి మండలం కలికిరి పంచాయతీ రెడ్డివారి పల్లి గ్రామం తుమ్మలపేట వడ్డిపల్లి నందు వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన కోళ్ల దొంగలను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు కలికిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్ అనిల్ కుమార్ తెలిపారు.కలికిరి పంచాయతీ తుమ్మలపేట వడ్డిపల్లి నందు ఈనెల 20వ తేదీన రాత్రి ఐదుగురు,పి.చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంటి వద్ద కోళ్ళ దొంగతనం చేస్తుండగా అది చూసిన చంద్రశేఖర్ ను కత్తితో చంపేందుకు ప్రయత్నం చేయగా తప్పించుకుని అరవడంతో గ్రామస్తులు రాకతో దొంగలు పరారయ్యారు.ఈ కేసులో శుక్రవారం ముగ్గురు మహిళా కోళ్ల దొంగలను ఎస్టీ కాలనీ వద్ద అరెస్టు చేశారు